డ్రైవింగ్‌లో ఉండగానే గుండెపోటు

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

డ్రైవింగ్‌లో ఉండగానే గుండెపోటు
– జనాలపైకి దూసుకెళ్లిన బస్సు
– మధ్యప్రదేశ్‌లో విషాధకర సంఘటన
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
దర్శిని డెస్క్‌ : బస్సు నడుపుతుండగానే డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యాడు. రన్నింగ్‌లో ఉన్న బస్సు వేగంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ విషాధకర సంఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి విజయ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో మెట్రో బస్సు అధర్తాల్ నుండి ప్రయాణికులతో దమోహ్నక వైపు వస్తోంది. దమోహ్నక వద్ద సిగ్నల్‌ వద్ద ఆగిన వాహనాలపైకి సిటీ బస్సు ఒకటి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగిన ద్విచక్ర వాహనదారులు, ఒక ఆటో రిక్షాతో పాటు కారును ఢీ కొట్టిందన్నారు. ద్విచక్రవాహనాలను ఈడ్చుకుంటూ కొద్దిదూరం వెళ్లిన తర్వాత బస్సు ఆగిపోయింది. బస్సు వేగం తక్కువగా ఉండడం, ఢీ కొట్టినప్పుడు పక్కకు పడడంతో ఆరుగురు వాహనదారులు గాయాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండెపోటుకు గురైన బస్సు డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడని పోలీసులు వివరించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.