వాల్మీకీల సంక్షేమానికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

వాల్మీకీల సంక్షేమానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన వాల్మీకీ సంఘం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బోయ వాల్మీకీల సంక్షేమానికి కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలోని వాల్మీకీ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో వాల్మీకీ మహర్షికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకీ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పలు సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.

వాల్మీకీ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు బోయరవి, రాము, ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, రొంపల్లి సంతోష్ కుమార్, వాల్మీకీ సంఘం పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

డిజిటల్ ఆర్సీలు వస్తున్నాయ్..!