రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు ఆదివారం తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు విద్యుత్ ఏడీఈ ఆదినారాయణ ఓ ప్రకటలో తెలిపారు. తాండూరు విద్యుత్ సబ్ స్టేషన్ 220కేవీ నిర్వహణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని తాండూరు మున్సిపల్, తాండూరు మండలంలోని గౌతాపూర్, చెంగోల్, ఎల్మకన్నె, పెద్దేముల్, యాలాల మండలాల్లోని పలు గ్రామాలతో పాటు కోట్‌పల్లి, బంట్వారం మండలంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
