మార్మోగిన మణికంఠుని నామస్మరణ

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్మోగిన మణికంఠుని నామస్మరణ
– డా. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పడిపూజ
– తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మణికంఠ నామస్మరణతో మార్మోగింది. మంగళవారం తాండూరు బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బివిజీ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్ దంపతుల ఆధ్వర్యంలో దేవాలయంలో ఆయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పడిపూజ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్, సునీతా సంపత్ లు ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడిపూజలో భాగంగా వారి కుమారుడు డాక్టర్ వాసు అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య తల్లిదండ్రుల పాదపూజ చేశారు. ఆయ్యప్ప స్వామి మెట్ల పూజలో డాక్టర్ సంపత్ కుమార్, సునీతా సంపత్, కుమారుడుతో పాటు తండ్రి, సినీయర్ వైద్యులు డాక్టర్ గోపాల్, కుటుంబ సభ్యులు పాల్గొని స్వామిని వేడుకున్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వాములు స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తూ భజన కీర్తనలు ఆలాపించారు. అయ్యప్ప స్వామి నామస్మరణలతో ఆలయం మార్మోగింది. అనంతరం డాక్టర్ సంపత్ కుమార్, సునీతా సంపత్ లు అయ్యప్ప స్వాములకు వద్ద నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో జరిగిన పడిపూజకు తాండూరు ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ దారి, తాండూరు డీఎస్సీ జి. శేఖర్ గౌడ్, పట్టు సిబి రాజేందర్ రెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు, అయ్యప్ప స్వాములు భారీగా తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. భక్తులు, స్వాముల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.