టీయూడబ్ల్యూ-ఐజేయూ రికార్డు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టీయూడబ్ల్యూ-ఐజేయూ రికార్డు..!
– తాండూరు డివిజన్లో 100 సభత్వాలు
– ఇంకా కొనసాగుతున్న చేరికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే – ఐజేయూ జర్నలిస్టు యూనియన్ వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రికార్డు సృష్టించింది. యూనియన్‌లో 100 మందికి పైగా సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణల ఆధ్వర్యంలో ఈ ఘనతను సాధించారు. గత కొన్ని రోజులుగా టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారిల సమక్షంలో సీనీయర్ పాత్రికేయులు కొనింటి ప్రభాకర్, లింగేష్‌, కృష్ణ(పెద్దేముల్), ఏబీఎన్ నర్సింలు ఇటీవలే 143 యూనియన్‌ను వీడి ఐజేయూ యూనియన్‌లో చేరారు.

వారి తరువాత నుంచి యూనియన్లలో చేరికలు, సభ్యత్వ నమోదులు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో సుమారు 60 నుంచి 70 వరకు ఉన్న సభ్యత్వాలు పలువురు చేరికలతో 100 సభ్యత్వాలను దాటింది. యూనియన్‌లోకి ఇంకా పలువురు జర్నలిస్టులు చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో టీయూడబ్ల్యూజే – ఐజేయూ యూనియన్ అత్యంత బలమైన యూనియన్‌గా అవతరించింది. తాజాగా శుక్రవారం హన్మంతు(ఆశయం), జగదీష్‌(విజేత), నరేందర్ రెడ్డి(మన తెలంగాణ)లకు టీయూడబ్ల్యూజే-ఐజేయూ యూనియన్ సభ్యత్వాన్ని అందజేశారు.

రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేస్తున్న డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణలను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు వాసు, రాష్ట్ర సభ్యులు రాంచెందర్, సీనీయర్ పాత్రికేయులు కొనింటి ప్రభాకర్, లింగేష్‌ లు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్‌ ఉన్నారు.

ఇదికూడా చదవండి…

చెరుకు రసంతో బోలెడు లాభాలు..!