మందుల కిట్లను సర్వనియోగం చేసుకోవాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్సీడీ మందుల కిట్లను సర్వనియోగం చేసుకోవాలి
– మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్
– బీపీ, షుగర్ బాధితులకు మందుల కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: దీర్ఘకాలిక రోగాలు బీపీ, షుగర్ తో బాధపడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్లను పంపిణీ చేస్తుందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ అన్నారు. శనివారం పట్టణంలోని గుమాస్తా నగర్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్సీడీ కిట్లను కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కారు పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఇందులో భాగంగా దీర్ఘకాలిక రోగాలు బీపీ, షుగర్ వంటి రోగాలను ఆదిలోనే నియంత్రించేందుకు ఎన్సీడీ మందుల కిట్లను పంపిణీ చేస్తుందన్నారు. ఈ కిట్లను రోగులు సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్ బసప్ప, ప్రమీల, ఆర్పీ అన్నపూర్ణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.