కంటి సమస్యలకు రక్షణ
– కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
– టీజేఎస్ మున్సిపల్ కౌన్సిలర్ సోమశేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కంటి సమస్యలతో బాధ పడే వారికి ప్రభుత్వం కంటి వెలుగు ద్వారా రక్షణ కల్పిస్తుందని టీజేఎస్, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని 34వ వార్డుకు సంబంధించి కంటి వెలుగు శిభిరాన్ని విజయ విద్యాలయ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.

ఈ శిబిరాన్ని సోమశేఖర్ స్కూల్ ప్రిన్సిపల్ శరత్కళతో కలిసి ప్రారంభించారు. అనంతరం పేదలతో పాటు కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధత్వ నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు -2ను ప్రారంభించందన్నారు. కంటి వెలుగు శిబిరాలతో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు, కంటి అద్దాలు అందజేస్తుందన్నారు. కంటి సమస్యలతో బాధపడే వారు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య శిబిరం వైద్యులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

