వైభవంగా అయ్యప్ప పడిపూజ
– అభిషేకం, పూజలు చేసిన శుభప్రద్ పటేల్
– హాజరైన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అయ్యప్ప నగర్ లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మణికంఠుని నామస్మరణతో మార్మోగింది. గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ ఆలయంలో వలసిన అయ్యప్ప స్వామికి పూజలో భాగంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడిపూజలో భాగంగా అయ్యప్ప స్వామి పల్లకి సేవ నిర్వహించారు. అయ్యప్ప స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు, నామస్మరణతో ఆలయం మార్మోగింది. పల్లకి సేవ ఊరేగింపులో శుభప్రద్ పటేల్ అయ్యప్ప స్వాములతో కలిసి ఆడిపాడారు. అనంతరం వేద పండితులు, గురుస్వాముల సమక్షంలో పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం శ్రీ కృష్ణమోహన్ రావు, మెంబర్లు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, రాష్ట్ర షిప్ అండ్ గోట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్ రాజ్, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, వైస్ ఎంపీపీ స్వరూపు వెంకట్రామ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కోట్రిక విజయలక్ష్మి, సునితా సంపత్, వివిధ కులసంఘాల నాయకులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పూజకు హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.


