వైభవంగా అయ్యప్ప పడిపూజ

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

వైభవంగా అయ్యప్ప పడిపూజ
– మణికంఠ ఆశ్రమంలో మార్మోగిన నామస్మరణ
– పూజకు హాజరైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఆదివారం ఆలయంలోని మణికంఠ ఆశ్రమం ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరిగానే పడిపూజ వైభవంగా జరిగింది. ఆశ్రమానికి చెందిన స్వాములు పడిపూజను కన్నుల పండగలా జరిపించారు.

పడిపూజలో అయ్యప్ప స్వాముల కీర్తనలు, గీతాలాపనలతో దేవాలయం మార్మోగింది. పడిపూజకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావులు హాజరయ్యారు. స్వాములతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆశ్రమ స్వాములు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, బోయరని, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సాయిపూర్ బాల్ రెడ్డి, మారేపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి, గడ్డల రవీందర్, సిద్రాల శ్రీనివాస్, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, డీవై నర్సింలు, యువనాయకులు బిర్కడ్ రఘు, అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.