కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం
– రాబోయో రోజుల్లో హస్తందే అధికారం
– టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహారాజ్
– తాండూరులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదలకు చేసిన సంక్షేమంతోనే కాంగ్రెస్ పార్టీ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని ఆపార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు నియోజక వర్గ ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ హాజరై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం. రమేష్ మహారాజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి మహాత్మగాంధీ ఆశయాలతో నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు అభివృద్ధి, సాంకేతిక రంగంలో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవానికి అందరు కృషి చేయాలన్నారు. రాబోయే ఆరోజుల్లో హస్తం అధికారం చేపట్టేలా పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

మరోవైపు టీపీసీసీ కార్యదర్శిగా నియామకం అయిన పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఎంఏ ఆలీం, బస్వరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నారా అశోక్, నవాజ్ యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.