ఉత్సహాంగా బతుకమ్మ చీరల పంపిణీ
– వార్డుల్లో చీరలను అందజేసిన కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ షురూ అయ్యింది. శనివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమం ఉత్సహాంగా కొనసాగింది. ఆయా వార్డులలోని రేషన్ దుకాణాల్లో కౌన్సిలర్లు హాజరై మహిళలకు, యువతులకు చీరలను అందజేశారు. 22 వ వార్డులో కౌన్సిలర్ రాము, 6వ వార్డులో బోయరవి, 31వ వార్డులో బంటారం లావణ్య తదితరులు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండగ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు, యువతులకు చీరలను అందజేస్తున్నారు. బతుకమ్మ చీరలను ధరించి పండగలను వైభవంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
