వైకల్యానికి మంచ్ చేయూత
– మార్వాడి యువమంచ్ శిబిరానికి స్పందన
– ప్రారంభమైన జైపూర్ కాళ్లు, కెలిపర్ శిబిరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికలాంగుల వైకల్యానికి చేయూతనందించేలా మార్వాడి యువమంచ్ మంచి సేవలందిస్తుందని జాతీయ ఉపాధ్యక్షులు లలిత్ కుమార్ జైన్, రాష్ట్ర అధ్యక్షులు సురేష్ జైన్‌లు పేర్కొన్నారు. తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలాజీ మందిర్‌లో వికలాంగుల కోసం ఉచిత జైపూర్ కాళ్ల పంపిణీ, కెలిపర్స్ పరికరాల అందజేత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మార్వాడి యువమంచ్ జాతీయ ఉపాధ్యక్షులు లలిత్ కుమార్ జైన్, రాష్ట్ర అధ్యక్షులు సురేష్ జైన్‌లు హాజరై తాండూరు ప్రగతి సమాజం అధ్యక్షులు రమేష్ చంద్ర సార్డాలతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ హితం కోసం మార్వాడి యువమంచ్ సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. వికలాంగుల వైకల్యానికి చేయూతనందించేలా తాండూరు మార్వాడి యువమంచ్ ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిఫర్స్ పరికరాలను అందజేయడం ఎంతో అభినందనీమని పేర్కొన్నారు.
సందర్శించిన డీఎస్పీ లక్ష్మీనారాయణ
మరోవైపు తాండూరు పట్టణం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత జైపూర్ కాళ్ల, కెలిఫర్స్ పరికరాల అమరిక శిబిరాన్ని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల కోసం నిస్వార్థంగా మార్వాడి యువమంచ్ సేవ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. వికలాంగులు గుర్తించుకునేలా సేవలందించే ఘనత మార్వాడి యువమంచ్‌కు దక్కుతుందని అన్నారు.
శిబిరానికి విశేష స్పందన
మరోవైపు బాలాజీ మందిరంలో ఏర్పాటు చేసిన ఉచిత జైపూర్ కాళ్ల, కెలిఫర్స్ పరికరాల అమరిక శిబిరానికి మంచి స్పందన లభించింది. హైదరాబాద్, భువనగిరి, యాదాద్రి, వనపర్తి, మహబూబ్ నగర్, అచ్చంపేట, పరిగి, కర్ణాటక రాష్ట్రం చించొల్లి, బీదర్ తదితర ప్రాంతాలకు చెందిన వికలాంగులు భారీగ తరలివచ్చారు.
ఉదయం నుంచి సాగిన శిబిరంలో 114 మంది వికలాంగులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ శిబిరంలో 5 నుంది టెక్నిషియన్ల బృందం వికలాంగుల నుంచి వైపూర్ కాళ్లతో పాటు కెలిఫర్ కాళ్ల పరికరాల అమరికకు కొలతలు తీసుకున్నారు. వీరికి 9,10 వ తేదిల్లో జైపూర్ కాళ్లు, కెలిఫర్ కాళ్లను అమర్చడం జరుగుతుందని మంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సార్డా తెలిపారు. అదేవిధంగా శిబిరానికి వచ్చిన వికలాంగులకు భోజన వసతి కల్పించడం జరిగిందన్నారు. రేపు, ఎల్లుండి శిబిరానికి వచ్చే వికలాంగుల నుంచి కొలతలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ సభ్యులు మహేష్ ఉపాధ్యాయ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ అగ్రవాల్, కన్వీనర్ శ్రీకాంత్ పండిత్, అనిల్ సార్థా, తాండూరు అధ్యక్షులు సన్ని అగ్రవాల్, కార్యదర్శి గౌ వింద్ ఆశావా, కోశాధికారి కిషన్ రాఠి, క్యాంపు చైర్మన్ సునిల్ సార్తా, తదితరులు పాల్గోన్నారు.

