గొల్ల చెరువుకు మహర్దశ

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

గొల్ల చెరువుకు మహర్దశ
– రూ.5.25 కోట్లతో సుందరీకరణ ప్రతిపాదనలు
– ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– ఆందోళన విరమించిన మత్స్యకారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని ఏకైక జలాశయం గొల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్‌కు మహర్దశ రాబోతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. గురువారం రాజుగౌడ్ తాండూరు బీఆర్ఎస్ నేతలతో కలిసి గొల్ల చెరువు ప్రాంతాన్ని సందర్శించారు.
గత 11 రోజులుగా గొల్ల చెరువులో పాతుకు పోయిన గుర్రపు డెక్క ఆకును తొలగిస్తూ ఆందోళన చేపట్టిన మత్య్సకారులతో మాట్లాడారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో గొల్ల చెరువు అభివృద్ధి, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని హామి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద గతంలో గొల్ల చెరువు అభివృద్ధికి రూ. 4.41 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. తాజాగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ ద్వారా రూ. 5.52 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనలతో గొల్ల చెరువులో గుర్రపు డెక్క మొక్కలతో పాటు వ్యర్థాలను తొలగించి, మురుగునీరు దారి మల్లింపు, తూము మరమ్మత్తులు, కల్వర్టుల నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మొక్కల తొలగింపు కోసం రూ. 43 లక్షలు ప్రతిపాదనలు ఉన్నాయని స్పష్టం చేశారు. గొల్ల చెరువు సుందరీకరణ, మత్య్సకారుల సంక్షేమానికి ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని అన్నారు. మత్స్యకారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. గొల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ ను మరింత సుందరీకణ చేసి మహర్ధశ తీసుకవస్తామని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ హామితో 11 రోజులుగా ఆందోళన చేస్తున్న మత్య్సకారులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ఉపాధ్యక్షులు హరి హరగౌడ్, మాజీ కౌన్సిలర్ సరుకుల నరేందర్ గౌడ్, ఉర్దూ ఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.