మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయం అని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి మునుగోడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అంత్యోదయ పథకాలు, బీజేపీ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ ప్రచారానికి అక్కడి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరో రెండు రోజులు మునుగోడులో ఉండి బీజేపీ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, యాలాల మండల అధ్యక్షులు మహిపాల్, బషీరాబాద్ మండల ఇంచార్జ్ రామ్యానాయక్ తదితరులు ఉన్నారు.