మంత్రి సబితారెడ్డి తల్లికి ఘన నివాళులు
– కోటబాస్పల్లిలో నివాళులు అర్పించిన నర్సింహారెడ్డి(బాబు)
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన తల్లి స్వర్గీయ గొట్టుగ వెంకటమ్మ, తండ్రి స్వర్గీయ మాజీ ఎంపీపీ గొట్టుగ మహిపాల్ రెడ్డిలకు ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం తాండూరు మండలం కోటబాస్పల్లిలో స్వర్గీయ గొట్టుగ వెంకటమ్మ 6వ వర్ధంతిని నిర్వచి హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సబితారెడ్డి సోదరుడు, తాండూరు సిటీ కేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి ట్రస్ట్ సభ్యులు నర్సింహా రెడ్డి (బాబు), ఆయన సతీమణి సద్గుణ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి సృతి వనంలో ఉన్న తల్లి వెంకటమ్మ, తండ్రి మహిపాల్ రెడ్డి సమాధులపై పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాందాస్, గ్రామ పెద్దలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

