కొత్త సచివాలయానికి ముహుర్తం

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కొత్త సచివాలయానికి ముహుర్తం
– ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్‌
– ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారయ్యింది. వచ్చెనెల ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. ఆరోజున ఎందుకంటే ఫిబ్రవరి 17వ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రారంభానికి చర్యలు చేపడుతున్నారు. రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్‌ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్‌, మజీద్‌ కూడా నిర్మిస్తున్నారు. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడం సహా వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.