వెంకటేష్ సేవలు మరువలేనివి

తాండూరు రాజకీయం వికారాబాద్

వెంకటేష్ సేవలు మరువలేనివి
– వారి కుటుంబానికి అండగా ఉంటాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చైల్డ్ లైన్ తాండూరు డివిజన్ కోఆర్డినేటర్, సామాజిక వేత్త దివంగత ఎర్ర వెంకటేష్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు అన్నారు. మూడు దశాబ్దాలుగా బాలకార్మికుల నిర్మూలనకు ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

సోమవారం తాండూరు మండలం వీర్ శెట్టిపల్లికి వెళ్లి వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి నివాళ్ళు అర్పించారు. ఈ సంధర్బంగా వెంకటేష్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 30 ఏళ్లుగా తనకు వెంకటేష్ పరిచయమని, ఎంవీ ఫౌండేషన్ ద్వారా వేళా మంది బాలకార్మికులకు చదువు నేర్పించారని అన్నారు. బాల్య వివాహాలు నిర్మూలనకు ఎనలేని కృషి చేశారన్నారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేసి పేదలకు సహాయం చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీర్శట్ పల్లి ఎంపీటీసీ, వెంకటేష్ తల్లి ఎర్ర నర్సమ్మ, అన్న ఎర్ర శ్రీనివాస్, భార్య ఎర్ర పద్మకి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డైరెక్టర్ ఎస్ రవి గౌడ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ చీమల నర్సిములు, మల్కాపూర్ గని సొసైటీ డైరెక్టర్ కోటి గోపాల్, తిమ్మాయిపల్లి మాజీ సర్పంచ్ కిష్టమ్మ తదితరులు ఉన్నారు.