సమర్థమైన మనోహర్ రెడ్డికే మద్దతు

తాండూరు రాజకీయం వికారాబాద్

సమర్థమైన మనోహర్ రెడ్డికే మద్దతు
– వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్ర. కార్యదర్శి మహమ్మద్ వసీం
– తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
– ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సమర్థవంతమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరుగుతుందని వెల్ఫేర్ పార్టీ ఇండియా(డబ్ల్యూపీఐ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ వసీం అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అయితే హైదరాబాద్లోని గోషామాల్లో మాత్రం ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదని, అక్కడ నోటాకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ప్రజలకు భరోసా ఇచ్చిందని, ఈ కారణంగానే ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, అబ్దుల్ రజాక్. పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల నాయకులు అబ్దుల్ రవూఫ్, మసూద్, డబ్ల్యూపీఐ తాండూరు అధ్యక్షులు ఇదాయత్ అలీ, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!