హామి నిలబెట్టుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– శివస్వాముల ఆశ్రమానికి రూ. 10 లక్షలు
-కృతజ్ఞతలు తెలిపిన శివ స్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన శివస్వాములకు ఇచ్చిన హామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయానికి చెందిన శివ స్వాములు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలిశారు. దె వాలయంలో శివ స్వాముల ఆశ్రమానికి చేయూత అందించాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని శివ స్వాములు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించి నిధులు మంజూరు చేయిస్తామని హామి ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో శివ స్వాముల ఆశ్రమానికి రూ. 10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శివ స్వాములు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో పోచమ్మ దేవాలయానికి ఆర్థిక సహాయం అందిస్తామని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు మసూద్, బీదర్ రాజశేఖర్, బోయరాజు, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, శివస్వాములు, మాజీ ఎంపీటీసీ మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ నర్సింలు, ఎల్లప్ప, సుందరప్పు, మహేష్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

