గణేష్ మండపాలకు అనుమతి తీసుకోవాలి
– టీఆర్ఎస్‌వై రాష్ట్ర కార్యదర్శి బిర్కట్ రఘు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటి సభ్యులందరు పోలీసుల అనుమతి తీసుకోవాలని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర కార్యదర్శి బిర్కట్ రఘు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి చేతుల మీదుగా వార్డు నెంబర్ 20 కట్ట మైసమ్మ గణేష్ ఉత్సవ సమితి తరుపున అనుమతిని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకులను ప్రతిష్టించిన మండపాల నిర్వహకులు వారి వారి మండపాల అనుమతి తీసుకోవాలని సూచించారు. పండగను ప్రశాంత వాతావరణలో జరుపుకునేందుకు పోలీసు శాఖతో పాటు వివిధ శాఖల అధికారులకు సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ ఉన్నారు.

