అట్టహాసంగా వినాయక సంస్థల బంపర్ డ్రా

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా వినాయక సంస్థల బంపర్ డ్రా
– ఎలక్ట్రిక్ స్కూటిని సొంతం చేసుకున్న ఆటో డ్రైవర్
– విజేతలకు బహుమతులు అందించిన కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని వినాయక సంస్థల ఆధ్వర్యంలో బంపర్‌ డ్రా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గత దసరా పండగ నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల వరకు వినాయక ఎలక్ట్రానిక్స్, వినాయక ఫర్నిచర్, వినాయక ఏజెన్సీలలో వెయ్యి రూపాయిలు కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి బంపర్ డ్రా కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం బంపర్ డ్రా విజేతల ఎంపికను నిర్వహించారు. వినాయక సంస్థల నిర్వహకులు ఓం ప్రకాష్ సోమాని, నితిన్ కుమార్ సోమాని, సూర్య ప్రకాష్ సోమాని, నియర్ సోమానిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ హాజరై డ్రా తీశారు. దాదాపు 43 మందికి సంబంధించి డ్రా తీశారు. ఇందులో రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ మౌలానా అనే వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటీని సొంతం చేసుకున్నారు. డ్రా విజేతలకు కందుకూరి రాజ్ కుమార్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, నిర్వహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.