లేగదూడకు బారసాల..!

జాతీయం తెలంగాణ

లేగదూడకు బారసాల..!
– అంగరంగ వైభవంగా వేడుక
– సోషల్‌ మీడీయాలో వైరల్‌
దర్శిని డెస్క్‌: ఎంతో మంది మూగ జీవాల పట్ల ప్రేమను ప్రదర్శిస్తారు. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే నామ కరణ వేడుక, పుట్టిన రోజు వేడుకలు, శ్రీమంతం వేడుకలు కూడ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇవి సాధారణం అయిపోయాయి. అయితే కుటుంబం లేగ దూడకు బారసాల నిర్వహించడం ఇక్కడ వైరల్‌గా మారింది. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. చాలామంది ఆవుని పెంచుకోవడానికి ఇష్టపడతారు. సొంత ఇంటి పిల్లల్లా భావించి అల్లముద్దుగా పెంచుకునే వారు ఎందరో ఉన్నారు. ఆవులు.. వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు.. వాటికి సంబంధించిన వేడుకలను జరుపుతారు. అయితే ఆవుకు బారసాల చేయడం మాత్రం అరుదు అని చెప్పవచ్చు. ఈ వేడుకను కూడా అత్యంత ఘనంగా జరిపారు ఓ కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వేళ్లటూరులో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన వల్లీ, సత్యనారాయణ దంపతులు 11 ఏండ్ల క్రితం ఒక ఆవును పెంచడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వారి వద్ద గోవుల సంఖ్య 60కి చేరింది. అందులో ఓ ఆవు సంతతి లేగదూడకు బారసాల కార్యక్రమం వైభవంగా జరిపారు. ఆ లేగ దూడకు విష్ణు అని నామకరణం చేశారు. దేశీయ గోవులను సంరక్షిచడం.. వాటి సంతతిని పెంపొదించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడా లేని విధంగా ఈ దంపతులు ఓ లేగదూడకు బారసాల చేసి.. మూగజీవాలపై ప్రమేను చాటి చాటడం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వింత సంఘటన సోషల్ మీడీయాలో వైరల్‌ అయ్యింది.