బీసీ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షులుగా సర్పంచ్ శ్రావణ్ కుమార్
– జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ సంక్షేమ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షులుగా మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్ కుమార్ నియామకం అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా శ్రావణ్ కుమార్ నియామకపత్రం అందుకున్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సమక్షంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. అదేవిధంగా అధ్యక్షులుగా ఎన్నికైన శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బీసీల సమస్యలు, డిమాండ్ల సాధనకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. బీసీ సంఘం మండల అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆర్.కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, నాయకులు నర్సింలు, మారేపల్లి తాండ సర్పంచ్ పాండు, గోట్లపల్లి సర్పంచ్ శేఖర్, హన్మాపూర్ సర్పంచ్ వెంకటేష్, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి, పెద్దముల్ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ వడ్ల సంగమేశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజీబ్, కురుమ సంఘం నాయకులు చంద్రయ్య, పెంటయ్య, బాలయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకటయ్య, సగర సంగం సభ్యులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలప్ప, కందనెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు స్వరాజ్, మంబాపూర్ మాజీ వార్డ్ నెంబర్ బుగ్గప్ప, ముదిరాజ్ సంఘ నాయకులు దేవరాజ్, నాయకులు మతిన్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

