కమణీయంగా శివపార్వతుల కళ్యాణం
– పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– శివ స్వాముల ఆశ్రమానికి భూమి పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని శ్రీ కోటేశ్వర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ జరిగింది. శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్భంగా ఆయలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల రాకతో ఆలయం కిక్కిరిసింది. ఆలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. శివ పార్వతులను ఎమ్మెల్సీ దర్శించుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శివ స్వాముల ఆశ్రమానికి భూమి పూజ నిర్వహించారు.

గతంలో శివ స్వాముల ఆశ్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రూ. 10లక్షలు మంజూరు చేయించారు. భూమి పూజ అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, శివ స్వాములు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప తదితరులు ఉన్నారు.
దర్శించుకున్న వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
మరోవైపు కోటేశ్వర దేవాలయంలో జరిగిన శివ పార్వతుల కళ్యాణోత్సవంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పల్లోళ్ల దీపా నర్సింలు పాల్గొన్నారు. శివ పార్వతులను దరి ఎంచుకున్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు ఉన్నారు.


