హ్యాపీ బర్త్ డే మహేందర్ అన్నా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హ్యాపీ బర్త్ డే మహేందర్ అన్నా..!
– మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన పైలెట్ రోహిత్ రెడ్డి
– జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి హ్యాపీ బర్త్ డే అన్నా అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి చేత కేక్ కట్ చేయించారు. కేక్ తినిపించి మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లను బీఆర్ఎస్ పార్టీ నేతలు గజమాలతో సత్కరించారు. దీంతో మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, నాయకులు శ్రీశైల్ రెడ్డి, పల్లెళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఇందర్ చెడ్ రాజు, సిద్రాల శ్రీనివాస్, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు