బడ్జెట్లో బీసీలకు నిరాశే.!

తాండూరు రాజకీయం వికారాబాద్

 బడ్జెట్లో బీసీలకు నిరాశే.!
– సంక్షేమాన్ని విస్మరించడం అన్యాయం
– ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం విచారకరం
– బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బీసీలను నిరాశ పరిచిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సంక్షేమం, ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో బీసీల సంక్షేమాన్ని విస్మరించినట్లుగా ఉందని అభిప్రాయ పడ్డారు. 2021-22 బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి రూ.5,222 కోట్లలో ఎంబీసీసీ రూ. 1 వెయ్యి కోట్లు, గీత కార్మికులకు రూ. 25 కోట్లు, చేనేత కార్మికులకు రూ. 338 కోట్లు, గొర్రెల యూనిట్లకు రూ.3 వేలు కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. గత యేడాది 2022-23 బడ్జెట్లో రూ.2,30,826 కోట్లతో పోలిస్తే ఈ సారి 13 శాతం పెరిగినా బీసీల సంక్షేమానికి సరైన కేటాయింపులు చేయలేదన్నారు. రూ.2,90,396 కోట్లలో ఎంబీసీ 12 కులాల ఫెడరేషన్లలో ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం ముమ్మాటికి బీసీలను విస్మరించడమే అని విమర్శించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి బడ్జెట్లో లో బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని అనుకుంటే బీసీల ఆశలను నిరాశ పరిచిందన్నారు.