డోలారోహణ వేడుకలో పాల్గొన్న నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండల సూపరిండెంట్ చెన్నప్ప మనుమరాలు, టీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ బంధువులకు చెందిన డోలారోహణ వేడుకలో రాజకీయ, పట్టణ ప్రముఖులు
పాల్గొన్నారు. ఆదివారం కోడంగల్ రోడ్డుమార్గంలోని ఎస్వీఆర్ గార్డెన్‌లో జరిగిన ఈ డోలారోహణ వేడుకకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా తాండూరు సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మాజీ
డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, ప్రేమ్ రాజ్, మనోహర్ యాదవ్, మాజీ ఎంపీటీసి గౌడీ వెంకటేశం, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా నాయకులు వెంకటేష్ చారి, యునాయకులు సంతోష్ గౌడ్, ఇంతియాజ్, కురుమ సంఘం నాయకులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
