మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత
– సాయం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: మృతుని కుటుంబానికి తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక చేయూతనందించారు. మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మాల ఎంకప్ప అకాల మరణం చెందారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు ఎంకప్ప కుమారులు రుద్రప్ప, తుల్జప్పలకు రూ. 3500లు ఆర్థిక సహాయం అందజేశారు. అధైర్యం చెందకండి అని కుటుంభానికి భరోసా అందజేశారు. అంత్యక్రియలకు సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల గుండప్ప, చాకలి మొగులప్ప, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.