ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా
– షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
– ఏయే స్థానాకుల ఎలక్షన్‌ జరుగుతుందంటే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌, 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 27న ఉపసంహరణకు గడువు, వచ్చేనెల మార్చి13న ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్‌లో స్పష్టం చేశారు.