ఆధునిక వృత్తి నైపుణ్యతతో ఆర్థికాభివృద్ధి
– మహిళలు శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహిళలు ఆధునిక వృత్తి నైపుణ్యతను సాధిస్తే ఆర్థిక అభివృద్ధి చెందడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బ్యాంకర్లు గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో బస్టాండ్ ఎదురుగా కాంప్లెక్స్ పైన నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కందుకూరి రాజ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. 45 రోజుల పాటు మహిళలకు నిర్వహించే శిబిరంలో ఎలాంటి శిక్షణను అందిస్తున్నారో తెలుసుకున్నారు. నిర్వహకులు సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలకు ఎంబ్రాయిడరీ లో శిక్షణ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకర్ల ఆధ్వర్యంలో తాండూరులోని మహిళలకు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మహిళలంతా ఏకాగ్రతతో శిక్షణ తీసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం బయటకు వచ్చిన తరువాత స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలన్నారు. ఇక్కడితో ఆగకుండా ఆధునిక వృత్తిలలో నైపుణ్యతను పెంపొందించుకోవాలన్నారు. ఈ దిశగా బ్యాంకర్లు, నిర్వహకులు దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాలాల్ మండల్ అధ్యక్షులు లక్ష్మణ చారి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్, యువ నాయకులు జూటుపల్లి వెంకట్, రాము ముదిరాజ్, లక్ష్మణ్, ఉపేందర్, సురేందర్, సాయికుమార్, అడాల్‌పూర్ అనంతయ్య, వడ్ల శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

