5 బైకులకు రూ. 26 వేల ఆదాయం

తాండూరు వికారాబాద్

5 బైకులకు రూ. 26 వేల ఆదాయం
– సీజ్ చేసిన వాహనాల వేలానికి స్పందన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: సీజ్ చేసిన వాహనాల వేలం ద్వారా ప్ర‌భుత్వానికి రూ. 26 వేల ఆధాయం వ‌చ్చింది. బుధ‌వారం తాండూరు ప్రోహిబిష‌న్ ఎక్సైజ్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన వాహ‌నాల వేలంకు మంచి స్పందన లభించింది. రెండేళ్ల నుంచి వివిధ కేసుల్లో పట్టుబడిన 5 వాహనాలకు జిల్లా ఎక్సైజ్ అసి స్టెంట్ సూపరిండెంట్ మల్లా రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సూపరిండెంట్ మల్లా రెడ్డి మాట్లాడుతూ మోటార్ వెహికిల్ ఇను స్పెక్టర్ పర్యవేక్షించిన మొత్తం 5 వాహనాలకు రూ. 35,500లకు నిర్ధారించడం జరిగిందన్నారు. ఈ మేరకు నిర్ధారించిన ధరకు తక్కువ కాకుండా వేలం ప్రారంభించడం జరిగిందన్నారు. 5. వాహనాల వేలం ప్రక్రియ ముగిసిన తరువాత రూ.35,500ల నిర్ధారిత ధరకు రూ.61,500లు వచ్చాయని, ఇందులో ప్రభుత్వానికి రూ. 26వేల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. అయితే వేలంలో పాల్గొన్న వాహనాలను దక్కించుకున్న వారు 18 శాతం జీఎస్టీ చలాన్, ఎక్సైజ్ చలాన్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్, ఎస్ఐ చిన్నరాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను సమర్పించినవారు