రాష్ట్రంలో 5323 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ
– నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌ను అందించారు. పాఠశాల విద్యాశాఖలో ఏకంగా 5323 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో 2343 ఇన్‌స్ట్రక్టర్లు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు937 పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్లు, 1435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కోఆర్డినేటర్లు, ప్రభుత్వ కళాశాలలకు 211 బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టునున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే ప్రకటించి. నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ జారీ చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
