స్థిరమైన లక్ష్యాలతో ఉన్నత భవిష్యత్తు
– ఆంగ్లంలో అందరు పట్టు సాధించాలి
-ఘనంగా శాలివాహన డిగ్రీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థిరమైన లక్ష్యాలను కలిగిఉంటే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఆంగ్ల భాషాచార్యులు డాక్టర్ భీమయ్య, అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావులు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను జరుపుకున్నారు. కళాశాలకు చెందిన తృతియ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలింకారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడులకు ఆంగ్ల భాషాచార్యులు డాక్టర్ భీమయ్య, అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే సిరమైన లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ముఖ్యంగా అంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత రంగాలలో ఉద్యోగవకాశాలను సాధించవచ్చన్నారు. అదేవిధంగా దేశ సమగ్రతకు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలన్నారు. అదేవిధంగా ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో ఉత్సహాంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అనురాధ రమేష్, అకాడమిక్ డైరెక్టర్ సిద్దిలింగయ్య, ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ శరత్ చంద్ర, డైరెక్టర్లు మోముల మాణిక్యం, లక్ష్మారెడ్డి, మాధవరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

