సీఎం కేసీఆర్ దేశానికి పీఎం కావాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్ దేశానికి పీఎం కావాలి
– మున్సిపల్ కౌన్సిలర్ అస్లాం, నాయకులు సలీం
– తాండూరులో దర్గా వద్ద ప్రార్థనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత దేశ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశానికి ప్రధాన మంత్రి కావాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ అస్లాం, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ సలీంలు ఆకాంక్షించారు.

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌ పార్టీగా అవతరించి మొదటి సారి 69వ జన్మదినం జరుపుకుంటున్న సీఎం కేసీఆర్‌కు సర్వమత దైవాల ఆశీస్సులు ఉండాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇందిరానగర్‌ గుండు పీర్ల దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అస్లాం, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ సలీం ఆధ్వర్యంలో పలువురు ముస్లిం సోదరులు సీఎం కేసీఆర్ క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో దేశానికి ప్రధాన మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజద్, యువకులు పాల్గొన్నారు.

ఈ వార్తను సమర్పించిన వారు…