భక్తి, సంప్రదాయాలకు ప్రతీక పెత్తర అమావాస్య
– తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తి, సంప్రదాయాలకు పెత్తర అమావాస్య ప్రతీకగా నిలుస్తోందని తాండూరు మార్కట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు.

శనివారం తాండూరు పట్టణ పరిధిలోని ఆదర్శనగర్ పాతకుంట వద్ద వెలసిన కట్ట మైసమ్మ దేవాలయంలో మాల అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అల్లంపల్లి ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్న విఠల్ నాయక్ ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాల అమావాస్య (పెత్తర అమావాస్య)కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పర్వదినాన కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ప్రతి అమావాస్యకు అల్లంపల్లి ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఇటీవల గణేశ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకున్నామని, అమ్మవారికి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలను సంబరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేష్, గౌరవ అధ్యక్షుడు వర్త్య విఠల్ నాయక్, అల్లంపల్లి ప్రకాష్, ఆలయ పూజారి, భక్తులు పాల్గొన్నారు.


