వైభోగం దుర్గమ్మ ఆగమనం..!
– 34వ వార్డులో భక్తిశ్రద్ధలతో స్వాగతం
– ఆరోసారి ప్రతిష్టాపన ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 34వ (ఘనాపూర్) వార్డు లో దుర్గామాత ఆగమన వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా ఆరో ఏడాది నిర్వహిస్తున్న ఈ వేడుకలు స్థానికంగా భక్తిభావాన్ని చాటనున్నాయి. శుక్రవారం రాత్రి దుర్గామాతకు ఘన స్వాగతం పలికేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేపట్టారు.

ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా దుర్గామాత ఆగమనాన్ని వైభవంగా నిర్వహించింది. అమ్మవారి రాకతో ఘనాపూర్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఆరో ఏడాది ఉత్సవాల నిర్వహణతో వివేకానంద ఉత్సవ కమిటీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. దుర్గామాత ఆగమన వేడుకలు భక్తుల ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి వేదికగా నిలవనున్నాయి.

