ఆర్టీసీలో ముగిసిన ఎన్నికలు
– తాండూరులో 97 శాతం ఓటింగ్
– కొనసాగుతున్న కౌంటింగ్..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు యూనియన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

శుక్రవారం తాండూరు ఆర్డీసీ డీపోలో ఉదయం 5గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసి సహాకారంతో టీడబ్ల్యూయూ తరుపున నవీన్ గౌడ్ (బాణం గుర్తు), ఏఐటీయూసీ సహాకారంతో ఈయూ తరఫున సుదర్శన్ (బస్సు గుర్తు), టీజేఎంయూ ఒంటరిగా యాదయ్య (గద గుర్తు) పోటీలో ఉన్నారు.

డిపో పరిధిలో మొత్తం 330 మందికి గాను 321 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7గురు గైర్హాజరు కాగా.. మరో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌తో తాండూరు డీపోలో 97శాతం నమోదయ్యింది.

పోలింగ్ సరళీ పూర్తయిన తరువాత సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. తాండూరు డీపోలో కౌంటింగ్ కొనసాగుతోంది. పదేళ్ల విరామం తరువాత నిర్వహిస్తున్న ఎన్నికల్లో యూనియన్ గెలుపుపై ఉత్కంఠత నెలకొంది.


