గుమస్తానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!

తాండూరు రాజకీయం వికారాబాద్

గుమస్తానగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!
– తీరొక్క పూలతో బతుకమ్మల పేర్పు
– ఆటపాటలతో మహిళల సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు తాండూరు పట్టణంలోని గుమస్తానగర్‌లో ఘనంగా నిర్వహించారు.

వరంగల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు.

సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకలు ఆహ్లాదకర వాతావరణాన్ని నింపాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

అర్హులకే ఓటు.. డబుల్‌ ఓట్లు ఔట్..!