క్రీడలతో నూతనోత్తేజం.. ఆరోగ్యం..!
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– సంగంకలాన్‌లో జోష్‌పుల్‌గా లోకయ్య గౌడ్ క్రికెట్ టోర్నమెంట్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : క్రీడలతో నూతనోత్తేజం.. ఆరోగ్యం లభిస్తాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ తన తాత లోకయ్య గౌడ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం జోష్‌పుల్‌గా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ హాజరై కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాందాస్, సర్పంచు రాజప్ప గౌడ్, నాయకులు పటేల్ ఉమాశంకర్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ తో పాటు పలువురు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, క్రీడల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. క్రీడల్లో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. క్రీడలతో లభించే నూతనోత్తేజంతో నిత్యం ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. అనంతరం చంద్రశేఖర్ గౌడ్, నిర్వహకులు పోటీలను ప్రారంభించిన నేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్, నాయకులు చెన్‌గెష్‌పూర్ ప్రవీణ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, కామిని శ్రీను, తిరుమలేష్, వెంకట్ రెడ్డి, బస్వరాజ్, సునీల్ కుమార్, లింగప్ప, కుషాలబాబ్, గైటప్ప, రమేష్, గోపాల్, నరెందర్, గణేష్, కృష్ణ, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

