పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడతే పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్స, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన అంజిలప్ప కు.36 వేల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ చెక్కు మంజూరయ్యింది. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లబ్దిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనందిస్తుందన్నారు. వైద్యం చేయించుకోలేని పేదలకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు మసూద్ తదితరులు ఉన్నారు.

