బహుజన రాజ్య స్థాపనే ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

బహుజన రాజ్య స్థాపనే ధ్యేయం
– బీఎస్సీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఎంపీ రాంజీ గౌతమ్
– తాండూరులో పార్టీ సమీక్షా సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపనే ధ్యేయంగా బీఎస్సీ(బహుజన సమాజ్ పార్టీ) పార్టీ ముందుకు సాగాలని ఆ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్‌లో తాండూరు అసెంబ్లీ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి రాంజీ గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, దేశంలో బీజేపీ రెండు ఒకటేనని విమర్శించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రెండు ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే తానే పార్లమెంట్‌లో పోరాడానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్‌ పేరుతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చె స్తోన్న మోసాలను తిప్పికొట్టాలంటే బీఎస్పీ పార్టీని బలో పేతం చేయాలన్నారు. బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా కార్యకర్తలందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ప్రభాకర్, కోఆర్డినేటర్లు చంద్రశేఖర్ బోయిని పసుపుల బాలస్వామి, వెంకటేష్ చవాన్, గొల్ల సతీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, జిల్లా నాయకులు సత్యమూర్తి దొరాశెట్టి, తాండూరు అధ్యక్షులు పి.ఆరుణ్ రాజ్, జిల్లా, అసెంబ్లీ, మండలాల నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.