బీఆర్ఎస్కు బుద్ది చెప్పినా సిగ్గురాలే..!
– రైతుల పేరుతో దొంగ దీక్షలు
– గులాబీ పార్టీని ఎవ్వరు నమ్మరు
– అన్నదాతలకు అండగా కాంగ్రెస్ సర్కారు
– తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో రైతులే బీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పినా ఆ పార్టీకి సిగ్గురాలేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు విమర్శించారు.

మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రైతు దీక్షపై విమర్శలు చేశారు. గత పదేళ్ల పాలనలో రైతులకు మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ది చెప్పినా సిగ్గురాలేదని అన్నారు. ఇంకా రైతుల పేరు చెప్పుకుని రైతు దీక్షలంటూ మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ హాయాంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ. 10వేలు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12వేలు ఇస్తుందని తెలిపారు. రైతు రుణమాఫి కింద ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫిని చేసిందని గుర్తుచేశారు. 25 లక్షల మందికి రూ. 1800 కోట్లు జమచేసిందని తెలిపారు. భూమిలేని రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12వేలు ఆర్ధిక సాయం అందిస్తుందని తెలిపారు. ధాన్యానికి మద్దతు ధర అందిస్తూనే రూ. 500ల బోసన్ మంజూరు చేస్తుందని అన్నారు.

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, పంటలు నష్టపోతే పరిహారం కింద ఎకరాకు రూ. 10వేల పరిహారం అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రైతులందరు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.


