గురుకులాల విద్యకు సర్కారు ప్రాధాన్యం
– 6 ఎకరాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలకు భవనం
– కాలేజీలో మౌళిక వసతుల కల్పనకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైటెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గురుకుల పాఠశాల, కళాశాలల విద్యకు ప్రాధాన్యమిస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. గురుకుల పాఠశాలు కళాశాలల్లో విద్యనందించేందుకు ప్రాధాన్యమిస్తోందన్నారు. త్వరలోనే తాండూరులో 6 ఎకరాల్లో తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీకి సొంత భవనం నిర్మించుకుందామన్నారు. అదేవిధంగా కాలేజీలో ఆర్వో ప్లాంట్, డైనింగ్ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు కాలేజీలో సైన్స్ ల్యాబ్, ఆర్ట్ రూం, లైబ్రరీ, వంట గదులను పరిశీలించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, అంతారం సర్పంచు రాములు, కౌన్సిలర్లు ముక్తార్, వెంకన్నగౌడ్, ప్రిన్సిపల్ సుజాత, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

