తొలిరోజు 113 మంది గైర్హాజరు..!

కెరీర్ తాండూరు వికారాబాద్

తొలిరోజు 113 మంది గైర్హాజరు..!
– నిమిషం నిబంధనతో 6గురు పరీక్షకు దూరం
– తాండూరులో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలిరోజు 113 మంది గైర్హాజరు అయ్యారు. నిమిషం నిబంధ కారణంగా ఆలస్యంగా వచ్చిన 6 మంది విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. బుధవారం తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షల సందర్భంగా పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరలకు సంబంధించి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, అంబేద్కర్ ఒకేషనల్, చైతన్య జూనియర్ కాలేజీ, సింధు బాలికల జూనియర్ కాలేజీ, సిద్ధార్థ్ జూనియర్ కాలేజీలతో పాటు ఒకేషనల్ విభాగంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేసీ, టీఎస్ డబ్ల్యూఆర్ కాలేజీలను కేటాయించారు. తొలిరోజు జనరల్‌ విభాగంలో 2111 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 83 మంది గైర్హాజరుతో 2028 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఓకేషనల్ విభాగంలో 638 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 30 మంది గైర్హాజరుతో 608 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా మొదటి రోజు 2749 మందిలో 113 మంది గైర్హాజరుతో 2636 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని కస్టోడియన్లు మల్లినాథప్ప, కృష్ణయ్యలు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆలస్యంగా ఆరుగురు
ఇంటర్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే నిబంధన ఉండడంతో ఆలస్యంగా వచ్చిన తగురు విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు.

పట్టణంలోని సింధు బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. అంతారం గ్రామానికి చెందిన నాగేందర్, బషీరాబాద్ మండలం జీవనీ గ్రామానికి చెందిన కార్తిక్, తాండూరు మండలం సిరిగిరి పేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్, పెద్దేముల్ మండలం మంబాపూర్‌ గ్రామానికి చెందిన నవశ్రీ, యాలాల మండలానికి చెందిన రమేష్, చరణ్ లు ఆలస్యంగా రావడంతో నిర్వహకులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో వారు పరీక్ష రాయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు పరీక్షా కేంద్రాలను తొలిరోజు స్క్వాడ్‌ టీంలు సందర్శించి తనిఖీలు చేపట్టాయి.