రైతుల అభ్యున్నతే ధ్యేయం..!
– ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
ఏ గ్రేడ్ ధ్యానానికి రూ.2060, బీ గ్రేడ్ రూ.2040 చొప్పున మద్దతు ధర అందిస్తుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దళారులకు రైతులు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు, డీసీఎంఎస్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

