పండుగకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
– స్కూటిపై చక్కర్లతో మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుని పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్న వినాయకుని మండపాలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సందర్శించారు.
స్కూటీపై వీధుల్లో పర్యటించి మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. అదేవిధంగా పండుగకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరిత సమయంలోనే ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని స్పష్టం చేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసిన సమీపంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, అఫ్పూ(నయూం), శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.


