ఎమ్మెల్సీ బూతు పురాణం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్సీ బూతు పురాణం
– నీ సంగ‌తి చూస్తా అంటూ సీఐకి బెధిరింపు
– సోష‌ల్ మీడీయాలో ఆడియో వైర‌ల్
– తాండూరు రాజ‌కీయాల‌లో దుమారం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: అత‌నో మాజీ మంత్రి, ఉమ్మ‌డి జిల్లా రాజ‌కీయాల్లో క్రీయాశీలంగా ఉన్నారు. అయితే స్థాయిని మ‌రిచి పోలీసుశాఖ‌లో ప‌నిచేస్తున్న సీఐపై బూతు పురాణం అందుకున్నాడు. సీఐపై చేసిన తిట్ల‌దండ‌కం సోష‌ల్ మీడీయాలో వైర‌ల్ అవుతోంది. ఆ పోన్‌లో మాట్లాడింది ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి కావ‌డం రాజ‌కీయ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే ఇటీవ‌ల జ‌రిగిన జాత‌ర ఉత్స‌వాల‌కు సంబంధించిన విష‌యంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయ‌న మాట్లాడుతూ ఉత్స‌వాల‌లో ఎమ్మెల్యే అనుచ‌రుల‌కు ఎందుకు రెడ్ కార్పేట్ ప‌రిచార‌ని ప్ర‌శ్నించారు. అంత‌టితో ఆగ‌కుండా తిట్ల‌దండ‌కం అందుకున్నారు. ప‌త్రిక‌ల్లో రాయ‌లేని ప‌దాల‌తో దుర్షాలాష‌లాడారు. ఎమ్మెల్యే అనుచ‌రుల‌ను రౌడీ షీట‌ర్లు అంటూ సంభోదించారు. మంత్రిగా ప‌నిచేసిన త‌న‌ముందు రెడ్ కార్పేట్ ప‌రిచావంటూ మండిప‌డ్డారు. ఏం పీకుతున్నావ్ అంటూ.. ఇసుక అమ్ముకుంటున్నావంటూ.. ఇక్క‌డి నుంచి వెళ్లిపోయినా కూడ నీ సంగ‌తి చూస్తా అంటూ హెచ్చ‌రించారు. ద‌మ్ముంటే కేసు పెట్టుకో అంటూ స‌వాల్ చేశారు. ఈ అడియో వ్య‌వ‌హారం సోష‌ల్ మీడీయాలో వైర‌ల్ కాగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి పోలీస్టేష‌న్‌లో ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది.