చలివేంద్రాల సేవలో మార్వాడీ యువమంచ్
– తాండూరు పట్టణంలో మూడు చలివేంద్రాల ఏర్పాటు
– ప్రారంభించిన పట్టణ సీఐ, సంఘాల సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవలో ముందుండే తాండూరు మార్వాడీ యువమంచ్ ఈ వేసవిలో చలివేంద్రాల సేవకు సిద్ధ మైంది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది బుధవారం ఉగాది పండగ సందర్భంగా మార్వాడి యువంచ్ ఆధ్వర్యంలో పట్టణంలో మూడు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.

పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రమేష్ చంద్రబూబ్, మధుసోనిల సహాకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సమాజం అధ్యక్షులు రమేష్ చంద్ర సార్డా, ఓం ప్రకాష్ సోమానిలు ప్రారంభించగా ఇందిరా చౌరస్తా పోలీస్టేషన్ సమీపంలో కైలాస్ సార్డా, మధుసూధన్ సార్డాల సహాకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా బస్టాండ్ సమీపంలో మహేష్ సార్డా సహాకారంతో ఏర్పాటు చేసిన మూడో చలివేంద్రాన్ని రాజస్థాని నవ యువక సంఘం అధ్యక్షులు మన్మోహన్ సార్డా, రాజస్థానీ మహిళ సంఘం అధ్యక్షురాలు పద్మసోనిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మార్వాడి యువమంచ్ చేపట్టే సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. అదేవిధంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించడమే మార్వాడి యువంమంచ్ ధ్యేయమన్నారు. పట్టణ వాసులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చలివేంద్రాలతో దాహార్తిని తీర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ సార్డా, సభ్యులు కుంజ్ బిహారి సోని, సన్ని అగ్రవాల్, దీపక్ గగ్రాని, కరణ్ జైన్, సమాజం పెద్దలు, మంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

