రంజాన్ సంతోషంగా జరుపుకోవాలి
– పేదలకు కిట్లు పంపిణీ చేసిన వాజిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం పవిత్ర పండగ రంజాన్‌ను అందరు సంతోషంగా జరుపుకోవాలని ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి వాజిద్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం రహమత్ నగర్‌లో మహమ్మద్ వాజిద్ రియల్ ఏసేట్ సంస్థ ద్వారా వాజిద్ రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. దాదాపు 300 మంది పేద ముస్లింలకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా రంజాన్ పండగను పురస్కరించుకుని పేదల ముస్లింలకు ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంలో పండగ కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరులో కిట్లను అందజేడం సంతోషంగా ఉందన్నారు. పండగ సందర్భంగా పేదలకు కిట్లు పంపిణీ చేయడంలో ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. కిట్లు అందుకున్న పేదలు పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, హైమద్ తదితరులు ఉన్నారు.

