విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు
– పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
– సోషల్ మీడియాను మంచికే వాడాలి
– జిల్లా అడిషనల్ ఎస్పీ పీవీ మురళీధర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగలు, ఉత్సవాల సమాయాల్లో విద్వేశాలు, అల్లర్లను రెచ్చగొడితే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ పీవీ మురళీధర్ అన్నారు. హనుమాన్ జయంతి, భద్రేశ్వర జాతర ఉత్సవాలు. రంజాన్ పండగను పురస్కరించుకుని శనివారం తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అధ్యక్షతన సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సాయిపూర్ తులసీనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ పీవీ మురళీధర్ హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలులు తదితరులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంద సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ పీవీ మురళీధర్ మాట్లాడుతూ పండగ సమయాల్లో ఐక్యమత్యాన్ని చాటితేనే ప్రశాంత సమాజం ఏర్పడుతుందన్నారు. వచ్చే పండుగులను, జాతర ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పండగ సమయాల్లో ఎలాంటి ఆందోళనలు, అల్లర్లు జరగకుండా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన అభినందనీయమన్నారు. అదేవిధంగా పండగ సమయాల్లో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, చిచ్చుపెట్టే ప్రసంగాలు పెట్టొద్దన్నారు. పోలీసు శాఖ సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, శాంతి భద్రత విఘాదాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలులు మాట్లాడుతూ పండగలు, ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, ముస్లిం వెల్ఫేర్ అసోపోయేషన్ ప్రతినిధులు ఖుర్షీద్ హుస్సేన్, కమల్ అతహర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ సోమశేఖర్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిగౌడ్, సీపీఐ నాయకురాలు విజయలక్ష్మీ పండిత్, బీజేపీ ఇంచార్జ్ రజనీకాంత్, బీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటేల్ ఉమాశంకర్, పండరి, శంషోద్దీన్, ఎంపీటీసీ రవిశిందే, టీడీపీ నాయకులు ముజీబ్, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు, ముస్లిం మత పెద్దలు, పట్టణ, మండల నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

